- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: బుమ్రా రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించిన ముంబై ఇండియన్స్..
IPL 2023: బుమ్రా రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించిన ముంబై ఇండియన్స్..

X
ముంబై: గాయం కారణంగా ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఐపీఎల్-16కు దూరమైన విషయం తెలిసిందే. తాజా అతని స్థానాన్ని ముంబై జట్టు భర్తీ చేసింది. కేరళకు చెందిన యువ పేసర్ సందీప్ వారియర్‌ను జట్టులోకి తీసుకున్నట్టు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ శుక్రవారం వెల్లడించింది. కాగా, 2021లో సందీప్ భారత్ తరఫున శ్రీలంకపై టీ20లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌ను అందిపుచ్చుకోకపోవడంతో అతనికి ఆ తర్వాత అవకాశాలు రాలేదు.
ఐపీఎల్‌లో గతంలో అతను కోల్‌కతా, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. లీగ్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 2 వికెట్లు తీశాడు. సందీప్‌ను కనీస ధర రూ. 50 లక్షలకు ముంబై జట్టు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తొలి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
Next Story






