IPL 2023: టాస్ గెలిచిన కోల్ కతా.. తొలి చాలెంజ్‌కి సిద్ధమైన నితీష్ రాణా!

by Disha Web Desk 19 |
IPL 2023: టాస్ గెలిచిన కోల్ కతా.. తొలి చాలెంజ్‌కి సిద్ధమైన నితీష్ రాణా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్‌లోని మొహాలి వేదికగా పంజాబ్, కోల్‌కతా మధ్య మరి కాసేపట్లో మ్యాచ్ మొదలుకానుంది. ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచింది. దీంతో కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఇక, సీజన్‌లో తొలి మ్యాచ్ కావడంతో ఇరుజట్లు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించాలని బరిలోకి దిగుతున్నాయి. శిఖర్ ధావన్, సామ్ కర్రాన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ప్లేయర్లతో పంజాబ్ బరిలోకి దిగుతుండగా.. తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న టీమిండియా బ్యాటర్ నితీష్ రాణా కెప్టెన్సీలో రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ వంటి స్టార్ ప్లేయర్స్‌తో పంజాబ్‌ను కోల్‌కతా ఢీకొట్టనుంది.

ఇరు జట్ల ప్లేయింగ్ లెవన్:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(సి), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), భానుకా రాజపక్స, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), మన్‌దీప్ సింగ్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

Next Story

Most Viewed