IPL 2023: టాస్ గెలిచిన హైదరాబాద్.. అందరి చూపు అతడిపైనే!

by Disha Web Desk 19 |
IPL 2023: టాస్ గెలిచిన హైదరాబాద్.. అందరి చూపు అతడిపైనే!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో మరి కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ మ్యాచ్‌లో అతిథ్య సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. సన్‌రైజర్స్ స్టాండ్ బై కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక నాలుగు సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచులు జరుగుతుండటంతో మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియానికి చేరుకుంటున్నారు. స్టేడియం పరిసర ప్రాంతమంతా ఆరెంజ్ మయమైంది. ఇక మెగా వేలంలో 13.25 కోట్లు వెచ్చించి హైదరాబాద్ కొన్న ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పైనే అందరి దృష్టి ఉంది

జట్ల వివరాలు:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (w/c), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్(w), ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్(c), T నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ



Next Story