టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

by Dishafeatures2 |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
X

దిశ, వెబ్ డెస్క్: ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో సన్ రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ కు పోవాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు నామమాత్రం కానుంది. ఆ జట్టు ఓడినా..గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే తన చివరి మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ 2023 సీజన్ను ముగించాలని హైదరాబాద్ పట్టుదలతో ఉంది

జట్ల వివరాలు

ముంబై ఇండియన్స్ జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు: మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ ధగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్మా లిక్.


Next Story