- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
IPL ఫైనల్: చేతులేత్తేసిన టాపార్డర్.. పీకల్లోతూ కష్టాల్లో హైదరాబాద్
![IPL ఫైనల్: చేతులేత్తేసిన టాపార్డర్.. పీకల్లోతూ కష్టాల్లో హైదరాబాద్ IPL ఫైనల్: చేతులేత్తేసిన టాపార్డర్.. పీకల్లోతూ కష్టాల్లో హైదరాబాద్](https://www.dishadaily.com/h-upload/2024/03/23/320384-srh.webp)
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఫైనల్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు తడబడుతున్నారు. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన టాపార్డర్ కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో చేతులేత్తేసింది. ఈ సీజన్లో సిక్సుల వర్షం కురిపిస్తూ ఆకట్టుకున్న యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యి పూర్తిగా నిరాశపర్చాడు. సునామీ ఇన్నింగ్‌లతో రెచ్చిపోతున్న ఇండియన్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
తెలుగు సంచలనం, బర్త్ డే బాయ్ నితీష్ రెడ్డి 10 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. 8 ఓవర్లలో 51 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుపోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్స్ మార్క్రమ్, క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నారు. ఈ సీజన్లో హైదరాబాద్‌కు ఒంటి చేత్తో విజయాలు అందించిన క్లాసెన్‌పైనే ఎస్ఆర్హెచ్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కోల్‌కతా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్ నిప్పులు చెరిగే బంతులతో హైదరాబాద్ బ్యాటర్లను వణికిస్తున్నాడు. రెండు వికెట్లు తీసి హైదరాబాద్‌ను ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు. వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా చెరో వికెట్ తీశారు.