నా భార్య కూడ అలా చెప్పలేదు.. ఆ ఇద్దరిలో బెస్ట్ ప్లేయర్ ఎవరంటే..? గంభీర్

by Disha Web Desk 3 |
నా భార్య కూడ అలా  చెప్పలేదు.. ఆ ఇద్దరిలో బెస్ట్ ప్లేయర్ ఎవరంటే..? గంభీర్
X

దిశ వెబ్ డెస్క్: ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాజీ క్రికెటర్, KKR మెంటార్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెస్సీ, రోనాల్డో ఇద్దరిలో ఎవరు బెస్ట్ ప్లేయర్ అంటే చెప్పడం కష్టమని అన్నారు. అయితే తనకు ఇంగ్లాండ్ ప్లేయర్ మార్కస్ రాష్‌ఫోర్డ్ అంటే ఇష్టమని తెలిపారు. అలానే అన్నింటికంటే కష్టమైన పని మన దేశంలో ప్రజల భిప్రాయాలను మార్చడం అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు.

తాను ఎవరో తెలియకపోయినా తాను అగ్రెసివ్ మైండెడ్ అని తనపై ఓ అభిప్రాయాన్ని ఓ వ్యక్తి క్రియేట్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే గంభీర్ నవ్వును చూసేందుకు జనాలు స్టేడియంకి రారని.. కేకేఆర్ గెలుపును చూసేందుకు మాత్రమే ప్రజలు వస్తుంటారని పేర్కొన్నారు. కాగా గంభీర్ వ్యాఖ్యలపైన స్పందించిన హోస్ట్ సైరస్ మీ నవ్వు బాగుంది అని అన్నారు.

కాగా తన భర్య కూడా ఎప్పుడూ తన నవ్వు బావుంది అని చెప్పలేదని గంభీర్ నవ్వుతూ తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న IPL 2024లో KKR అద్భుతంగా రానిస్తోంది. గౌతమ్ గంభీర్ మెంటార్‌షిప్‌‌లో దుమ్ములేపుతున్న KKR జట్టు 6 మ్యాచ్‌లలో 4 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. కాగా ప్రస్తుతం ఈ జట్టు RCBతో తన సొంత మైదానం ఈడెన్ గార్డెన్‌లో తలపడేందుకు సిద్ధమవుతోంది.



Next Story

Most Viewed