IPL 2023 : ధోనీ సిక్సర్లకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ఫ్రాంచైజీ, ఫ్యాన్స్‌కు కీలక సూచన

by Disha Web Desk 13 |
IPL 2023 : ధోనీ సిక్సర్లకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ఫ్రాంచైజీ, ఫ్యాన్స్‌కు కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. లక్నో జట్టు మ్యాచ్‌లో భాగంగా.. రెండు సిక్సర్లతో రెచ్చిపోవడం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 20వ ఓవర్లో వచ్చి వరుసగా రెండు బంతులను సిక్సర్లుగా బాది.. మూడో బంతికి ధోనీ అవుటయ్యాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ధోనీ యూనిఫామ్‌కు సూపర్ మ్యాన్ మాదిరిగా రెక్కల మాదిరి ఏర్పాటు చేయాలంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి సూచించారు. అంతేకాదు ధోనీకి ప్రత్యేక యూనిఫామ్ డిజైన్లు సూచించాలంటూ ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. ధోనీ యూనిఫామ్ కోసం వాటిల్లో మంచి డిజైన్‌ను సీఎస్కే తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఫ్యాన్స్ చాలా మంది తమదైన సూపర్ హీరో క్యాస్ట్యూమ్ డిజైన్లను ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు.



Next Story