రిటైర్మెంట్ పై రోహిత్ శ‌ర్మ ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది!

by velandi.Saikiran |

రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ, ఆలోచించాల్సిన సమయం వచ్చిందని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు సెహ్వాగ్.

రిటైర్మెంట్ పై రోహిత్ శ‌ర్మ ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సందర్భంగా రోహిత్ శర్మకు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు శిబిరంలోనే ఉంటూ కోలుకుంటున్నాడు. బెంగళూరుపైన జరిగిన మ్యాచ్ నేపథ్యంలో గాయపడ్డ రోహిత్ శర్మ, ఇప్పటికే రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. అతడు నెక్స్ట్ మ్యాచ్ ఆడేది కూడా డౌట్ గానే ఉందని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది ముంబై ఇండియన్స్. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ వరుస ఓటముల‌తో ఇబ్బందులు పడుతోందని వెల్లడించారు. ఇలాగే ఆట తీరు కొనసాగితే, ఎలిమినేట్ కాక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా అలెర్ట్ గా ఉండాలన్నారు. రోహిత్ శర్మ ఫామ్ ఏ మాత్రం బాగాలేదని.. అతడు గాయపడడం ముంబై ఇండియన్ కు తీవ్రమైన దెబ్బ అని వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్ గురించి రోహిత్ శర్మ, ఆలోచించాల్సిన సమయం వచ్చిందని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు సెహ్వాగ్. అభిమానులు ప్రశ్నించే పరిస్థితి రాకముందే నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు. జట్టు ప్రదర్శన కూడా బలహీనంగా ఉండటంతో అతనిపై ఒత్తిడి మరింత పెరుగుతుందని తెలిపారు. రోహిత్ శర్మ తిరిగి ఎప్పుడు ఆడతారనేది ఇంకా తెలియని పరిస్థితిలో ముంబై ఉందని వ్యాఖ్యానించారు.

Next Story