ఉర్విల్ ప‌టేల్ విధ్వంసం..కోహ్లీకి ముచ్చెట‌మ‌లు !

by velandi.Saikiran |   (  Updated:2026-05-10 21:30:52  IST  )

లక్నో పైన ఉర్విల్ పటేల్ ఆడిన ఇన్నింగ్స్ ను రాయ్ పూర్ నుంచి ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ టీవీలో వీక్షించాడు.

ఉర్విల్ ప‌టేల్ విధ్వంసం..కోహ్లీకి ముచ్చెట‌మ‌లు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోపై ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు చెన్నై ఆటగాడు ఉర్విల్ పటేల్. కేవలం 13 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ధాటిగా ఆడి, 65 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ఉర్విల్ పటేల్ గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు జనాలు. అయితే లక్నో పైన ఉర్విల్ పటేల్ ఆడిన ఇన్నింగ్స్ ను రాయ్ పూర్ నుంచి ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ టీవీలో వీక్షించాడు. అదిరిపోయే సిక్సర్లు, బౌండరీలు ఉర్విల్ పటేల్ కొడుతుంటే.. కంటి రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండిపోయాడు కింగ్ కోహ్లీ.

ముంబై ఇండియన్స్ తో ఆదివారం బెంగుళూరు మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే ఉర్విల్ పటేల్ ఊచకోత బ్యాటింగ్ చేశాడు. దీంతో ఆ మ్యాచ్ పై ఫోక‌స్ చేయ‌కుండా విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన క్రికెటర్లందరూ ఉర్విల్ బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయారు. ఇది ఇలా ఉండగా ఉర్విల్ పటేల్ ఆడిన అదిరిపోయే ఇన్నింగ్స్ నేపథ్యంలో లక్నోపైన ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ దెబ్బకు లక్నో ఎలిమినేట్ కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ 5వ స్థానానికి ఏక బాగింది.

Next Story