ఒక్క రోజులో నలుగురి చేతులు మారిన ఆరెంజ్ క్యాప్

by velandi.Saikiran |   (  Updated:2026-04-26 04:30:26  IST  )

నిన్న ఒక్కరోజునే మొత్తం నలుగురి చేతుల్లోకి ఆరెంజ్ క్యాప్ మారింది.

ఒక్క రోజులో నలుగురి చేతులు మారిన ఆరెంజ్ క్యాప్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ప్రతి మ్యాచ్ చివరి వరకు సాగుతోంది. చివరలో విజయం తారుమారవుతోంది. ఇక శనివారం రెండు మ్యాచ్ లు జరగగా ప్రతి జట్టు 200కు పైగా పరుగులు సాధించింది. ఈ రెండు మ్యాచ్ లలో కూడా ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఆరెంజ్ క్యాప్ కోసం తీవ్రమైన పోటీ

శుక్రవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ దక్కింది. అయితే నిన్న సాయంత్రం ఢిల్లీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా కె.ఎల్ రాహుల్ 152 పరుగులు సాధించాడు. ఈ తరుణంలోనే ఆరెంజ్ క్యాప్ రాహుల్ కు దక్కింది. ఇక శనివారం సాయంత్రం ఏడున్నర గంటలకు హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో వైభవ్ సెంచరీ చేయడంతో ఆరెంజ్ క్యాప్ 15 ఏళ్ల బుడ్డోడికి దక్కింది. ఇది జరిగిన కొన్ని నిమిషాల్లోనే, హైదరాబాద్ తరఫున అర్థ సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ఆరెంజ్ క్యాప్ వెళ్ళిపోయింది. ఇలా నిన్న ఒక్కరోజునే మొత్తం నలుగురి చేతుల్లోకి ఆరెంజ్ క్యాప్ మారింది.

ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడేది వీళ్లే

ఐపీఎల్ 2026లో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ అభిషేక్ శర్మ దగ్గర ఉంది. అతడు ఇప్పటి వరకు 380 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 357 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. అటు రాహుల్ కూడా 357 పరుగులు సాధించాడు. క్లాసెన్ 349 పరుగులతో నాలుగు స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

Next Story