ఆర్సీబీ ఫ్యాన్స్ కు షాక్‌..ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా కోహ్లీ !

by velandi.Saikiran |

ఆర్సీబీ ఫ్యాన్స్ కు షాక్‌..ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా కోహ్లీ బ‌రిలోకి దిగే ఛాన్స్ ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆర్సీబీ ఫ్యాన్స్ కు షాక్‌..ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా కోహ్లీ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో, ఇరు జట్ల ప్లేయర్లు ప్రాక్టీస్ లో చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే ముంబై పై గెలిచిన ఉత్సాహంతో బెంగళూరు, దూకుడుగా ముందుకు వెళ్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో బెంగళూరుకు ఊహించని షాక్ తగిలినట్టు తెలుస్తోంది.

ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా విరాట్ కోహ్లీ

వైరల్ ఫీవర్ తో బాధపడుతోన్న విరాట్ కోహ్లీ, ఇవాళ్టి మ్యాచ్ సందర్భంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతాడని అంటున్నారు. బ్యాటింగ్ సమయంలో విరాట్ కోహ్లీని ( Virat Kohli) వినియోగించుకొని, బౌలింగ్ సమయంలో జాకబ్ డఫ్ఫీని ( Jacob Duffy ) వినియోగించుకునేందుకు బెంగుళూరు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. మరో మూడు మ్యాచ్ ల పాటు ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా విరాట్ కోహ్లీ కొన‌సాగుతాడ‌ని అంటున్నారు.

Next Story