- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: ‘ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు!’ గ్రౌండ్‌లో అర్జున్ టెండూల్కర్ పరిస్థితి చూసి ఫ్యాన్స్ ఎమోషనల్
ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కుమారుడైనప్పటికీ, ఆటకు ఎవరూ అతీతులు కారు అనడానికి తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం. ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. లక్నో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ మైదానంలో తోటి ఆటగాళ్లకు డ్రింక్స్ మోస్తూ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హోరెత్తిన స్టేడియం.. దక్కిన గౌరవం
ఆదివారం నాటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టులో అర్జున్‌కు చోటు దక్కలేదు. అయినప్పటికీ ఏమాత్రం అసంతృప్తి వ్యక్తం చేయకుండా, బౌండరీ లైన్ వద్ద సహచర ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తూ జట్టుకు తన మద్దతును తెలిపాడు. ఇది గమనించిన అభిమానులు స్టేడియంలో అతడి పేరుతో హోరెత్తించారు. తలచుకుంటే ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే వీలున్నప్పటికీ.. ఇగోలకు పోకుండా ఓ సాధారణ ఆటగాడిలా శ్రమిస్తున్న అర్జున్ క్రీడాస్ఫూర్తిని చూసి ప్రతి ఒక్కరూ సలాం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అభిమానుల ఆవేదన
అర్జున్ డ్రింక్స్ మోస్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. ‘అవకాశం ఇస్తేనే కదా తన ప్రతిభ నిరూపించుకునేది’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్రాంఛైజీల తీరును తప్పుబడుతున్నారు. గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పుడు, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్నా అతడిని కేవలం బెంచ్‌కే పరిమితం చేస్తుండటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని నెటిజన్‌లు ఎమోషనల్ అయ్యారు.






