- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిల్, సాయి సుదర్శన్ ఔట్.. వైభవ్ కు బిగ్ రిలీఫ్
ఐపీఎల్ 2026 ఫైనల్స్ నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి బిగ్ రిలీఫ్ దక్కింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్స్ నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి బిగ్ రిలీఫ్ దక్కింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య ఫైనల్స్ ప్రారంభం కాగా... ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న సాయి సుదర్శన్, గిల్ త్వరగానే వికెట్ సమర్పించుకున్నారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ బేబీ బాస్ వైభవ్ తొలి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోబోతున్నాడు. ఈ సీజన్ లో అత్యంత భయంకరంగా బ్యాటింగ్ చేసిన వైభవ్, 776 పరుగులు సాధించాడు. అన్ క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ, ఆరెంజ్ క్యాప్ దక్కించుకోబోతున్నాడు.
వైభవ్ సూర్యవంశీ తర్వాత రెండో స్థానంలో గిల్ ఉన్నాడు. 16 మ్యాచ్ లలో ఇప్పటి వరకు గిల్ 732 పరుగులు సాధించాడు. అటు సాయి సుదర్శన్ 724 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ ఇద్దరు ఓపెనర్లు, ఫైనల్స్ సందర్భంగా 20 లోపే ఔట్ అయ్యారు. ఇది వైభవ్ కు కలిసి వచ్చింది. ఇద్దరిలో ఎవరో ఒకరు అర్థ సెంచరీ చేసి ఉంటే, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి నిరాశ ఎదురయ్యేది. కానీ అదృష్టం కొద్ది ఈ ఇద్దరు తోపు ఆటగాళ్లు తొందరగానే ఔట్ అయ్యారు. దీంతో ఆరెంజ్ క్యాప్ కింద దాదాపు పది లక్షల రూపాయలు అందుకోబోతున్నాడు వైభవ్.






