గేల్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టాడు, కానీ అత‌న్ని ట‌చ్ చేయ‌డం వైభ‌వ్ వ‌ల్ల కాదు !

by velandi.Saikiran |

క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్, సురేష్ రైనా రికార్డింగ్ మాత్రం టచ్ చేయలేకపోయాడు.

గేల్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టాడు, కానీ అత‌న్ని ట‌చ్ చేయ‌డం వైభ‌వ్ వ‌ల్ల కాదు !
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు. బలమైన బౌలింగ్ దళం ఉన్న హైదరాబాద్ జట్టును చిత్తు చేశాడు. నిన్నటి మ్యాచ్ లలో కేవలం 29 బంతుల్లో వైభవ్ 97 పరుగులు చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 14 సంవత్సరాలుగా ఈ రికార్డు గేల్ పేరుపైన ఉంది. అయితే 15 ఏళ్ల వయస్సు ఉన్న వైభవ్, నిన్నటి మ్యాచ్ సందర్భంగా ఆ రికార్డు బ్రేక్ చేశాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

సురేష్ రైనా రికార్డ్ టచ్ చేయ‌డం క‌ష్ట‌మేనా ?

క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్, సురేష్ రైనా రికార్డింగ్ మాత్రం టచ్ చేయలేకపోయాడు. ఐపీఎల్ టోర్నమెంట్ లో భాగంగా పవర్ ప్లే లో 25 బంతుల్లో 87 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు సురేష్ రైనా. 2014 సంవత్సరంలో పంజాబ్ కింగ్స్ పైన ఈ రికార్డు సాధించాడు. దాదాపు 12 సంవత్సరాలుగా ఈ రికార్డు సురేష్ రైనా పేరుపైనే ఉంది. నిన్న హైదరాబాద్ పై అద్భుతంగా ఆడిన వైభవ్, ఈ రికార్డు కూడా చెరిపేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ 25 బంతులలో 81 పరుగులు మాత్రమే సాధించాడు వైభవ్. దీంతో సేఫ్ జోన్ లో సురేష్ రైనా ఉండిపోయాడు. ఈ మేరకు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, క్వాలిఫైయర్ 2, లేదా ఫైనల్స్ లో క‌చ్చితంగా ఈ రికార్డు బ్రేక్ చేస్తాడని వైభవ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story