SRH VS RR: వైభ‌వ్ వ‌ర్సెస్ అభిషేక్‌..ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్?

by velandi.Saikiran |

వైభ‌వ్ వ‌ర్సెస్ అభిషేక్‌..ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్ అనే చ‌ర్చ మొద‌లైంది.

SRH VS RR: వైభ‌వ్ వ‌ర్సెస్ అభిషేక్‌..ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా మరికాసేపట్లో ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో SRH, రాజస్థాన్ జట్లు తలపడతాయి. ఈ నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్ కోసం రెండు జట్లు సిద్ధమయ్యాయి. ముల్లన్‌పూర్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ నాకౌట్ మ్యాచ్ ల నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ వర్సెస్ అభిషేక్ శర్మ ఇద్దరిలో ఎవరు బాగా ఆడతారని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ?

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కంటే, అభిషేక్ శర్మ బెస్ట్ అని లెక్కలు చెబుతున్నాయి. ఈ సీజన్ లో వైభవ్ 583 పరుగులు చేస్తే, అభిషేక్ శ‌ర్మ‌ 563 మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా వైభవ్ సూర్య వంశీకే ఎక్కువగా ఉంది. కానీ యావరేజ్ విషయంలో మాత్రం 43.30తో అభిషేక్ శర్మ ముందంజలో ఉన్నాడు. అదే వైభవ్ యావరేజ్ 34 మాత్రమే. అంటే ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా అభిషేక్ శర్మ ఆడుతున్నాడు అన్నమాట. అలాగే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం అభిషేక్ కు ఉంది.

ఒత్తిడిని కూడా అభిషేక్‌ తట్టుకొని, చెలరేగి ఆడతాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా వేయగల సత్తా అభిషేక్ సొంతం. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ లో అవలీలగా భారీ షాట్లు ఆడుతాడు. అదే వైభవ్ సూర్య వంశీకి మాత్రం ఇలాంటి క్వాలిటీస్ లేవు. అంతర్జాతీయ మ్యాచ్ లలో వైభవ్ సూర్యవంశీకి ఆడిన అనుభవం తక్కువ. ఒత్తిడిని ఈ వయసులో ఎదుర్కోవడం కూడా కష్టమే. అందుకే క్రీడా విశ్లేషకులు కూడా అభిషేక్ శర్మనే బెస్ట్ అంటున్నారు. భవిష్యత్తులో అభిషేక్ శర్మ కంటే వైభవ్ ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Next Story