- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాడ్స్ రేటు పెంచేసిన 15 ఏళ్లు బుడ్డోడు వైభవ్!
15 ఏళ్లు బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ యాడ్స్ రేటు పెంచేశాడు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఆరెంజ్ క్యాప్ తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ దాదాపు రూ.50 లక్షల వరకు ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు. ఇందులో టాటా కంపెనీకి సంబంధించిన కారు కూడా ఉంది. ఐపీఎల్ అంటే వైభవ్ సూర్యవంశీ అన్నట్లుగా సీన్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే తన బ్రాండ్ ఫీజును భారీగా పెంచాడట వైభవ్.
ఐపీఎల్ ప్రారంభాని కంటే ముందు ఒక్కో బ్రాండ్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు కోటి రూపాయల వరకు ఛార్జ్ చేశాడట. ఐపీఎల్ 2026 లో సక్సెస్ అయిన నేపథ్యంలో తన బ్రాండ్ ఫీజులు రెండు కోట్లకు పెంచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా రెడ్ బుల్, కంప్లాన్ బ్రాండ్లతో ఇప్పటికే ఒప్పందం చేసుకొని, కొత్త ఛార్జ్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అటు ఏడాదికి రూ.12 కోట్లు ఇస్తామని ఓ ప్రముఖ బ్యాట్ కంపెనీ కూడా వైభవ్ కు ఆఫర్ ఇచ్చినట్లు మొన్నటి నుంచి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.






