- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.13 కోట్లు పెట్టి కొంటే హాయిగా పడుకున్నాడు..SRH ఆటగాడిపై సెటైర్లు
కేకేఆర్, సన్ రైజర్స్ మధ్య నిన్న మ్యాచ్ జరగగా రూ. 13 కోట్ల ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ రిలాక్స్ అవుతూ కనిపించాడు.

దిశ, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ పై దారుణంగా ట్రోలింగ్ నడుస్తోంది. రూ.13 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే, మనోడు హాయిగా నిద్రపోతున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. కేకేఆర్, సన్ రైజర్స్ మధ్య గురువారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ విక్టరీ కొట్టింది. మొన్న బ్యాటింగ్ అదరగొట్టిన హైదరాబాద్, కేకేఆర్ పైన బౌలింగ్ లోనూ దుమ్ము లేపింది. ఈ దెబ్బకు 65 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ నేపథ్యంలో లియామ్ లివింగ్‌స్టోన్ ను ట్రోల్ చేస్తున్నారు.
నిద్రపోతున్న రూ. 13 కోట్ల ప్లేయర్
కేకేఆర్, సన్ రైజర్స్ మధ్య నిన్న మ్యాచ్ జరగగా రూ. 13 కోట్ల ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్ రిలాక్స్ అవుతూ కనిపించాడు. ఆవలింపులు తీస్తూ.. కెమెరా కంటపడ్డాడు. దీంతో అతనిపై దారుణంగా సెటైర్లు పేల్చుతున్నారు. మొన్నటి మినీ వేలంలో లియామ్ లివింగ్‌స్టోన్ ను రూ. 13 కోట్లకు ఏరి కోరి కావ్య మారన్ కోనింది. అయితే అలాంటి ప్లేయర్ ను ఇప్పటి వరకు జట్టు కోసం వాడుకోలేదని సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తనకు అవకాశం రాకపోవడంతో లియామ్ లివింగ్‌స్టోన్ కూడా హాయిగా రిలాక్స్ అవుతున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు.
కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా ఆవలింపులు తీస్తూ నిద్రపోయాడని మరికొంతమంది ఆడుకుంటున్నారు. అతనికి రూ. 13 కోట్లు పెట్టి దండగనే అంటూ మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యాలు అతన్ని భరించి వదిలేశాయని.. కానీ ఆ ప్లేయర్ పై రూ.13 కోట్లు కావ్య పెట్టడం దారుణం అంటూ మరికొంతమంది చురకలు అంటిస్తున్నారు. ఈ మేరకు లియామ్ లివింగ్‌స్టోన్ ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు.






