- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి సూర్యవంశీ చేతికి ఆరెంజ్ క్యాప్
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 222/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, రాజస్థాన్ ఓపెనర్లు సూర్యవంశీ(43), యశస్వి జైస్వాల్(51) అందించిన మెరుపు ఆరంభం ఆ జట్టుకు కలిసొచ్చింది. చివర్లో డోనోవన్ ఫెర్రీరా శుభమ్ దూబే ఇద్దరూ 77 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. పంజాబ్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి ఓటమి.
అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన సంచలన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ సీజన్‌లో 400 పరుగుల మార్కును అందుకున్న మొదటి ఆటగాడిగా నిలిచి, తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో సూర్యవంశీ 238.09 స్ట్రైక్ రేట్ 400 రన్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మ 380, కె.ఎల్. రాహుల్ 358, విరాట్ కోహ్లీ 351, హెన్రిచ్ క్లాసెన్ 349 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా గత శనివారం ఆరెంజ్ క్యాప్ ఒకే రోజు నలుగురు ఆటగాళ్ల చేతులు మారిన సంగతి తెలిసిందే.






