రెచ్చిపోయిన వైభవ్.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

by Muthe.Rajitha |

15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసం నెక్స్ట్ లెవెల్ కి చేరింది.

రెచ్చిపోయిన వైభవ్.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్ : 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసం నెక్స్ట్ లెవెల్ కి చేరింది. శుక్రవారం గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 201/8 పరుగులతో మంచి స్కోరు సాధించినప్పటికీ, వైభవ్ ఊచకోత ముందు ఆ స్కోరు ఏమాత్రం సరిపోదనిపిస్తోంది. పవర్‌ప్లేలోనే ఆర్‌సీబీ బౌలర్లను విచక్షణారహితంగా బాదుతూ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు.

వైభవ్ రికార్డుల వేట..

మ్యాచ్ 4.3 ఓవర్ వద్ద బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచి వైభవ్ తన ఫిఫ్టీ మార్కును చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది జాయింట్ 3వ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (Joint 3rd fastest fifty)గా రికార్డు సృష్టించింది. గతంలో యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో చేసిన ఫిఫ్టీ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉండగా, వైభవ్ ఈ సీజన్‌లోనే ఇలా 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. కేవలం 15 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ ఇలాంటి స్ట్రైక్ రేట్‌తో ఆడటం క్రికెట్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మ్యాచ్ అప్‌డేట్ - రాజస్థాన్ జోరు

ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ స్కోరు 132/3 గా ఉంది. వైభవ్ సూర్యవంశీ 78 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ధృవ్ జురెల్ (39*), రియాన్ (3*) ఉండగా.. మ్యాచ్ గెలవడానికీ ఇంకా 65 బంతుల్లో 69 పరుగులు మాత్రమే కావాలి. పవర్‌ప్లేలోనే దాదాపు సగం టార్గెట్‌కు చేరువ కావడంతో రాజస్థాన్ గెలుపు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Next Story