- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకాశమే హద్దుగా చెలరేగిన SRH.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం!
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ గ్రౌండ్ నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఓపెనర్లు అభిషేక్ శర్మ (74), ట్రావిస్ హెడ్(38) పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలోనే రికార్డు స్థాయిలో పరుగులు రాబట్టి జట్టుకు బలమైన పునాది వేశారు. ఓపెనర్లు ఇచ్చిన ఊపును ఇషాన్ కిషన్ (27), హెన్రిచ్ క్లాసెన్ (39) అద్భుతంగా కొనసాగించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ సహా కీలకమైన బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల ధాటికి ఫీల్డర్లు కూడా ప్రేక్షకులుగా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక భారీ హిట్టర్లు ఉన్న పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 20 ఓవర్లలో 220 పరుగులు చేయాల్సి ఉంది. ముల్లాన్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్నప్పటికీ, ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం శ్రేయాస్ అయ్యర్ సేనకు సవాల్‌తో కూడుకున్న పని. సన్‌రైజర్స్ బౌలర్లు ఈ భారీ స్కోరును ఎలా కాపాడుకుంటారో చూడాలి. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు, శషాంక్ సింగ్ రెండు, బార్‌ట్లెట్ ఒక వికెట్ తీశారు.






