- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోల్‌కతా చిత్తు.. బోణీ కొట్టిన హైదరాబాద్
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2026 సీజన్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ (SRH) తొలి విజయం దక్కించుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ (SRH) తొలి విజయం దక్కించుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 15.6 ఓవర్లలోనే అన్ని వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 65 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించడమే కాకుండా ఈ సీజన్ లో పాయింట్ల టేబుల్ లో ఖాతా తెరిచింది. కోల్‌కతా బ్యాటర్స్ లో రఘువంశీ (52), రింకు సింగ్ (35), ఫిన్ అలెన్ (28) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కత్ 3, నితీశ్ 2, ఎషాన్ మలింగ, 2, హర్ష్ దూబె ఒక వికెట్ తీశారు.
Next Story






