- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026 : SRH కు మరో విజయం
by Muthe.Rajitha |
నేడు రాజస్థాన్ రాయల్స్(RR), హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో దూసుకు పోతోంది. నేడు రాజస్థాన్ రాయల్స్(RR), హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగుకు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యవంశీ వైభవ్(103), జురెల్(57) పరుగులు చేసారు. ఇక 229 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు అలవోకగా టార్గెట్ ను చేధించింది. 18.3 ఓవర్లలోనే 229 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(74), అభిషేక్(57), నితీష్(36) పరుగులతో జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. భారీ లక్ష్యం ముందు ఉన్నప్పటికీ సన్ రైజర్స్ బ్యాటర్స్ ముఖ్యంగా ఇషాన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఇది హైదరాబాద్ కు వరుసగా నాలుగో విక్టరీ. రాజస్థాన్ కు ఇది మూడో ఓటమి.
Next Story






