SRH ఫ్యాన్స్ కు మ‌రో గుడ్ న్యూస్‌

by velandi.Saikiran |

SRH రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ 25వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి.

SRH ఫ్యాన్స్ కు మ‌రో గుడ్ న్యూస్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: SRH అభిమానులకు బిగ్ రిలీఫ్ దక్కింది. స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతి త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 25వ తేదీన రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ సందర్భంగా తాను అందుబాటులో ఉంటానని స్వయంగా ప్యాట్ కమిన్స్ వెల్లడించారు. ఈ మేరకు ప్యాట్ కమిన్స్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. గాయం కారణంగా స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ జట్టుకు దూరమైన ప్యాట్ కమిన్స్, జట్టులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సన్ రైజర్స్ బౌలింగ్ చాలా వీక్ గా ఉన్న నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ రీ-ఎంట్రీ ఇవ్వాల‌ని సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు పెడుతున్నారు. ఏప్రిల్ 18వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ కు ప్యాట్ కమిన్స్ అందుబాటులోకి రావాలని.. హైదరాబాద్ ను గెలిపించాలని ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు. అయితే దీనికి ప్యాట్ కమిన్స్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. తాను ఏప్రిల్ 18 రాబోనని, రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు.

Next Story