- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ లో పెను ప్రమాదం..గ్రౌండ్ లోనే కుప్పకూలిన అయ్యర్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చేతికి తీవ్రమైన గాయమైంది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో తన తొలి మ్యాచ్ లోనే పంజాబ్ కింగ్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చేతికి తీవ్రమైన గాయమైంది. పంజాబ్ బ్యాటర్ కాన్లీ కొట్టిన బంతి నేరుగా వచ్చి, మరో ఎండువైపు ఉన్న శ్రేయాస్ అయ్యర్ చేతికి తగిలింది. బంతి బలంగా తగలడంతో గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. ఈ క్రమంలోనే అయ్యర్ కుడి చేతికి ఈ గాయం అయింది.
అయితే వెంటనే వైద్య నిపుణులు వచ్చి, ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత కూడా బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డ శ్రేయాస్ అయ్యర్, వెంటనే, క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కాగా గాయం తీవ్ర తరం అయితే మాత్రం, పంజాబ్ కింగ్స్ ఆడబోయే తర్వాతి మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ వణికిపోతున్నారు. కెప్టెన్ అయ్యర్ లేకపోతే జట్టు గెలవడం కష్టమే అంటున్నారు. కాగా ఈ మ్యాచ్ లో 18 పరుగులకు అయ్యర్ ఔట్ అయ్యాడు.






