చెపాక్ లో ఇషాన్ చర్యలు.. మద్దతిస్తున్న సీనియర్స్

by Muthe.Rajitha |

సోమవారం CSK, SRH మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం చెలరేగిన వివాదం తీవ్ర చర్చకు దారి తీసింది.

చెపాక్ లో ఇషాన్ చర్యలు.. మద్దతిస్తున్న సీనియర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం CSK, SRH మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం చెలరేగిన వివాదం తీవ్ర చర్చకు దారి తీసింది. మ్యాచ్ గెలిచిన అనంతరం సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ చెన్నై అభిమానులను ఉద్దేశించి చేసిన చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులను అలా అవమానిస్తూ ప్రవర్తించడం పట్ల నెటిజన్స్, తమిళ మీడియా అసహనం వ్యక్తం చేసింది. అయితే అనూహ్యంగా ఈ విషయంలో ఇషాన్ కిషన్ కు సీనియర్ ప్లేయర్ల మద్దతు లభిస్తోంది. సునీల్ గవాస్కర్, సెహ్వాగ్, అశ్విన్ లాంటివాళ్లు ఇషాన్ చర్యలను సమర్థిస్తున్నారు. కుర్రాళ్ళు ఆ మాత్రం అగ్రెసివ్ గా ఉండటంలో తప్పులేదు అని గవాస్కర్ వ్యాఖ్యానించగా.. సెహ్వాగ్ మాత్రం చెన్నై అభిమానులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇషాన్ ను సపోర్ట్ చేసారు. తాను తన కుమారునితో ఆ మ్యాచ్ చూడటానికి వచ్చానని, ఒక దశలో CSK అభిమానుల విజిల్ బ్లోయింగ్ చాలా చిరాకు తెప్పించిందని, వాళ్ళు అలా రెచ్చగొట్టడం వల్లే ఇషాన్ అలా రియాక్ట్ కావాల్సి వచ్చిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

తను ఎంత అసహనంగా ఫీల్ అయి ఉంటే అలా ప్రవర్తించి ఉంటాడో తాను అర్థం చేసుకోగలను అంటూ వెనకేసుకొచ్చాడు. ఇక మరో సీనియర్ ఆటగాడు అశ్విన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు. చెపాక్ లో మ్యాచ్ ఉన్న ప్రతిసారి అభిమానుల విజిల్ గోల ఎక్కువగా ఉంటుందని, ఇప్పటికైనా స్టేడియంలోకి విజిల్స్ బ్యాన్ చేయాలని నిర్వాహకులను కోరాడు. మొత్తానికి చెన్నై అభిమానుల పాలిట విలన్ గా మారిన ఇషాన్ ప్రవర్తనపై సీనియర్లు మద్దతు తెలుపుతుండటంతో బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇక చెన్నై చెపాక్ స్టేడియంలోకి విజిల్స్ తీసుకు రావడం మ్మీద బ్యాన్ కూడా విధించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story