- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెంపలేసుకొని పక్కన పెట్టండి.. గ్రీన్‌పై సెహ్వాగ్ ఫైర్!
చెంపలేసుకొని పక్కన పెట్టండి అంటూ గ్రీన్‌పై సెహ్వాగ్ ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: కేకేఆర్ ప్లేయర్ కామెరాన్ గ్రీన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మొన్నటి మినీ వేలంలో రూ. 25 కోట్లు పెట్టి, కామెరాన్ గ్రీన్ ను కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ ఆ రేంజ్ లో గ్రీన్ మాత్రం ఆడడం లేదు. బౌలింగ్, బ్యాటింగ్ లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ ల్లో కలిపి 100 పరుగులు కూడా దాటలేదు కామెరాన్ గ్రీన్.
ఈ నేపథ్యంలో కామెరాన్ గ్రీన్ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యారు. రూ. 25 కోట్లు పెట్టి, అతన్ని కొనడం దండగ అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా తప్పు చేశామని ఒప్పుకొని చెంపలు వేసుకోవాలని కేకేఆర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కామెరాన్ గ్రీన్ ను పక్కకు పెట్టి, మరో ప్లేయర్ ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచనలు చేశారు. గ్రీన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్ కు అవకాశం ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.






