ఐపీఎల్ ఫైన‌ల్స్...గుజ‌రాత్ టైటాన్స్ జెర్సీలో మెరిసిన సారా !

by velandi.Saikiran |

గుజరాత్ టైటాన్స్ జెర్సీలో సారా దర్శనమిచ్చారు.

ఐపీఎల్ ఫైన‌ల్స్...గుజ‌రాత్ టైటాన్స్ జెర్సీలో మెరిసిన సారా !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ ఫైనల్స్ మోడీ స్టేడియం వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్న ఈ ఫైనల్స్ నేపథ్యంలో సచిన్ కూతురు సారా టెండూల్కర్ ఫోటోలు వైరల్ గా మారాయి. గుజరాత్ టైటాన్స్ జెర్సీలో ఆమె దర్శనమిచ్చారు. తన ఫ్రెండ్స్ తో కలిసి, మోడీ స్టేడియానికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గిల్, సారా ఇద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు గత ఐదు సంవత్సరాలుగా జోరుగా ప్రచారం సాగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ అంశంపై సారా, గిల్ ఇద్దరిలో ఎవరూ ఎక్కడ స్పందించలేదు.

కానీ వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం అయితే తగ్గడం లేదు. స్టేడియంలో సారా ఎప్పుడు మెరిసినా, గిల్ కోసమే వచ్చినట్లు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక ఇవాళ ఫైనల్స్ గుజరాత్, బెంగళూరు మధ్య జరుగుతున్న నేపథ్యంలో గిల్ సేనకు సపోర్టుగా సారా వచ్చినట్లు మళ్లీ ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ ఫోటోలలో ఎలాంటి వాస్తవం లేదని, ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మరికొంతమంది చెబుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మ్యాచ్ ప్రారంభం అయ్యేవరకు ఆగాల్సిందే. నిజంగానే స్టేడియానికి సారా వస్తే, కెమెరామెన్ కచ్చితంగా ఆమెను ఫోకస్ చేస్తాడు. అప్పుడు అసలు విషయం తేలనుంది.

Next Story