వివాదానికి చెక్.. క‌లిసిపోయిన సంజు, క్లాసెన్‌

by velandi.Saikiran |

మొన్న మ్యాచ్ జ‌రుగుతుండ‌గా గొడవపడ్డ సంజు శాంసన్, క్లాసెన్ ఇద్దరు మళ్లీ కలిసి పోయారు.

వివాదానికి చెక్.. క‌లిసిపోయిన సంజు, క్లాసెన్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: మొన్న మ్యాచ్ జ‌రుగుతుండ‌గా గొడవపడ్డ సంజు శాంసన్, క్లాసెన్ ఇద్దరు మళ్లీ కలిసి పోయారు. మ్యాచ్ మ‌ధ్య‌లో చోటు చేసుకున్న వివాదానికి చెక్ పెడుతూ... ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఫీల్డ్ లో కొన్నిసార్లు అలా అవుతుందని.. కానీ క్లాసెన్ పైన తనకు ఎంతో అభిమానం, గౌరవం ఉందంటూ సంజు పేర్కొన్నారు. ఈ మేరకు క్లాసెన్ తో దిగిన ఫోటోలు షేర్ చేశారు. ఇక ఈ పోస్టుకు క్లాసెన్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఆ ఫోటోను షేర్ చేసి ఫ్రెండ్లీ పోస్ట్ పెట్టారు కాటేరమ్మ కొడుకు క్లాసెన్.

నీ ఆటను ఎంజాయ్ చేస్తాను బ్రో.. మన నెక్స్ట్ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అభిమానులు. ఆట పూర్తయిన తర్వాత ప్లేయర్స్ ఇలాగే కలిసిపోవాలని కోరుతున్నారు. అలాంటప్పుడే, క్రికెట్ కు మరింత ఆదరణ పెరుగుతుందని చెబుతున్నారు. కాగా మొన్న హైదరాబాద్, చెన్నై మ్యాచ్ జరగగా.. క్లాసెన్ ను సంజు స్టంప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు మధ్య గొడవ రాజుకుంది.

Next Story