IPL : ఎలిమినేటర్ మ్యాచ్.. రాజస్థాన్ గెలుపు

by Muthe.Rajitha |   (  Updated:2026-05-27 18:09:36  IST  )

IPL ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ పై 47 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది.

IPL : ఎలిమినేటర్ మ్యాచ్.. రాజస్థాన్ గెలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : ముల్లాన్ పూర్ వేదికగా జరుగుతున్న IPL ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్(RR), హైదరాబాద్ సన్ రైజర్స్(SRH)పై 47 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆరెంజ్ టీమ్ బౌలర్లకు రాజస్థాన్ యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. ఫోర్లు సిక్సులు బాదుతూ.. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. సన్ రైజర్స్ బౌలర్లు ఎవరూ సూర్యవంశీ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయలేకపోయారు. కాగా నిర్ణీత 20 ఓవర్లకు రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక 244 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అవడం.. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అభిషేక్, హెడ్, కిషన్ ల వికెట్లు కూడా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. నితీశ్‌ కుమార్‌రెడ్డి (38), సలీల్‌ అరోరా (35), ఇషాన్‌ కిషన్‌ (33) రాణించగా.. మిగతావారు అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో సన్‌రైజర్స్‌ ఓటమి తప్పలేదు. 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆల్ ఔట్ కావడంతో 47 రన్స్ తేడాతో రాజస్థాన్ విక్టరీ నమోదు చేసింది. అటు బ్యాటింగులోనూ, ఇటు బౌలింగులోనూ సత్తా చాటిన RR.. ఎల్లుండి గుజరాత్ తో క్వాలిఫైయర్-2 ఆడనుంది.

Next Story