- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RR vs RCB.. తొలి ఓటమి చూసేదెవరో?
by Muthe.Rajitha |
IPL లో భాగంగా నేడు డిఫెండింగ్ ఛాంపియన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : IPL లో భాగంగా నేడు డిఫెండింగ్ ఛాంపియన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్(RR), బెంగుళూరు రాయల్ చాలెంజర్స్(RCB) జట్ల మధ్య సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుత సీజన్లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్క ఓటమిని కుడా నమోదు చేయలేదు. నేడు జరగబోయే మ్యాచులోనే తొలి ఓటమి రుచి చూడబోతున్నాయి. రాజస్థాన్ ఆడిన మూడు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండగా.. RCB రెండు విజయాలతో టేబుల్ లో 3వ స్దానంలో ఉంది. కాగా IPL చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 31 మ్యాచుల్లో తలపడగా.. RCB 17 సార్లు, RR 14 సార్లు విజయం సాధించాయి. కాగా నేటి మ్యాచుకు వర్షం అంతరాయం లేదని సమాచారం. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ లోనూ సమానంగా ఉన్న ఈ రెండు జట్లలో గెలిచేది ఎవరో సాయంత్రం తేలనుంది.
Next Story






