- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరాట్ కోహ్లీ ఊచకోత..ఐపీఎల్ 2026లో బెంగళూరు తొలి విజయం
ఐపీఎల్ 2026 లో బెంగళూరు బోణీ కొట్టింది. హైదరాబాద్ తో జరిగిన ప్రారంభ మ్యాచ్ లోనే 6 వికెట్ల తేడాతో బెంగళూరు కొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో బెంగళూరు బోణీ కొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం హైదరాబాద్ తో జరిగిన ప్రారంభ మ్యాచ్ లోనే 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. సన్ రైజర్స్ విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని, పోరాడి గెలిచింది బెంగుళూరు. విరాట్ కోహ్లీ చివరి వరకు నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో 38 బంతుల్లోనే ఐదు బౌండరీలు, 5 సిక్సర్లు కొట్టిన విరాట్ కోహ్లీ 69 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఐపీఎల్ కెరీర్ లో ఎన్నడూ లేని దూకుడు ఈ మ్యాచ్ లో ప్రదర్శించాడు కోహ్లీ. ఈ దెబ్బకు 15.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది బెంగళూరు. దీంతో ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ పై విజయం సాధించింది. అటు సన్ రైజర్స్ బ్యాటింగ్ అద్భుతంగా రాణించినప్పటికీ, బౌలింగ్ ఫీల్డింగ్ రెండు విభాగాల్లో విఫలమై, తొలి ఓటమిని చవి చూసింది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీతో పాటు దేవ్‌దత్ పడిక్కల్ కూడా బాగానే ఆడాడు. ఈ మ్యాచ్‌లో 61 పరుగులు సాధించి, దుమ్ములేపాడు. అదే సమయంలో హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.






