గుజరాత్ త్రిముఖ వ్యూహాం.. అహ్మదాబాద్ లో ఆర్సీబీ గెల‌వ‌డం క‌ష్ట‌మేనా ?

by velandi.Saikiran |

గుజరాత్ త్రిముఖ వ్యూహాంతో బ‌రిలోకి దిగుతోంది. దీంతో ఆర్సీబీ గెల‌వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు.

గుజరాత్ త్రిముఖ వ్యూహాం.. అహ్మదాబాద్ లో ఆర్సీబీ గెల‌వ‌డం క‌ష్ట‌మేనా ?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు గుజరాత్, బెంగుళూరు రెండు జట్లు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాయి. సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ షురూ అవుతుంది. మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో బెంగుళూరును ఎలాగైనా ఓడించి, మరోసారి ఛాంపియన్ అయ్యేందుకు గుజరాత్ టైటాన్స్ స్కెచ్ ల మీద స్కెచ్ లు వేస్తోంది. ముఖ్యంగా బెంగుళూరు టాపార్డర్ ను దెబ్బ తీసేందుకు, వైభవ్ పైన ప్రయోగించిన అస్త్రాన్ని ఇక్కడ అమలు చేసేందుకు గుజరాత్ సన్నద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

బెంగళూరు టాప్ ఆర్డర్ లో దాదాపు అందరూ ఇండియన్ క్రికెటర్లే. అందుకే బౌన్సర్లతో ఇబ్బంది పెట్టేందుకు ప్లాన్ చేశారట. బౌన్సర్లతో మొన్న వైభవ్ సూర్యవంశీని చాలా ఇబ్బంది పెట్టింది గుజరాత్. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారట. మహమ్మద్ సిరాజ్, జాసన్ హోల్డర్, కగిసో రబాడ ఈ ముగ్గురితో త్రిముఖ వ్యూహం రచించారట. పవర్ ప్లే లోపే మూడు నుంచి నాలుగు వికెట్లు పడగొట్టేలా స్కెచ్ వేశారట. ఒకవేళ ఇదే జరిగితే.. మోడీ స్టేడియంలో బెంగుళూరుకు భంగపాటు తప్పదు అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

Next Story