IPL 2026 Final : సాయి సుదర్శన్ కూడా ఔట్.. కష్టాల్లో గుజరాత్

by Harish |

IPL 2026 Final : సాయి సుదర్శన్ కూడా ఔట్.. కష్టాల్లో గుజరాత్
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్-2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ కష్టాల్లో పడింది. ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ తీవ్రంగా నిరాశపరిచారు. హేజిల్‌వుడ్ వేసిన బౌలింగ్‌లో రజత్ పటిదార్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు గిల్(10) పెవిలియన్ చేరాడు. ఆ కాసేపటికే సాయి సుదర్శన్‌కు కూడా భువీ చెక్ పెట్టాడు. సుదర్శన్ 12 బంతుల్లో 12 పరుగులే చేసి అవుటయ్యాడు. దీంతో పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు పడటంతో జీటీ కష్టాల్లో పడింది. ఈ సీజన్‌లో గుజరాత్‌ విజయాల్లో గిల్, సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషించారు. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బలంగా లేకపోవడంతో వీరు త్వరగానే అవుటవడం గుజరాత్‌కు భారీ దెబ్బే. ఇక జీటీ ఆశలన్నీ బట్లర్‌పైనే పెట్టుకుంది. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ 2 వికెట్లు కోల్పోయి 39 రన్స్ చేసింది. ఆర్సీబీ బౌలర్లు ఇలాగే విజృంభిస్తే గుజరాత్ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Next Story