IPL 2026: ఆదుకున్న పటిదార్.. రాజస్థాన్ ఎదుట భారీ టార్గెట్

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

IPL 2026: ఆదుకున్న పటిదార్.. రాజస్థాన్ ఎదుట భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో (RR)తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరును అందించాడు. బాధ్యతాయుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన పటిదార్, మైదానం నలుమూలల సిక్సర్ల వర్షం కురిపించి రాజస్థాన్ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే కోహ్లీ రూపంలో ఎదురుదెబ్బ తగిలినా, పటిదార్ ఏమాత్రం తగ్గలేదు. వన్ డౌన్‌లో వచ్చి రాజస్థాన్ స్పిన్ అటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 40 బంతుల్లో 63 పరుగులు చేశారు. అంతకుముందు విరాట్ కోహ్లీ (32), చివర్లలో వెంకటేశ్ అయ్యర్ (29), షెఫర్డ్ (22) పరుగులు చేశారు. మొత్తంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ 201 పరుగులు చేసింది. రాజస్థాన్ విజయం సాధించాలంటే 202 పరుగుల చేయాల్సి ఉంది. ఆర్చర్, బిష్ణోయ్, బ్రిజేశ్ తలో రెండు వికెట్లు తీయగా, సందీప్, జడేజా తలో వికెట్ తీశారు.

Next Story