- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల వీరవిహారం: ముంబై టార్గెట్ 241 పరుగులు!
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పరుగుల సునామీ సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పరుగుల సునామీ సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (50), ఫిలిప్ సాల్ట్ (78) ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ అర్ధసెంచరీలతో చెలరేగి జట్టుకు భారీ పునాది వేశారు. ఓపెనర్లు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ (53), టిమ్ డెవిడ్ (34) ఏమాత్రం తగ్గకుండా ముంబై బౌలర్లను ఉతికి ఆరేశారు. చివర్లో వీరిద్దరూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో ఆర్సీబీ స్కోరు 240కి చేరింది. సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ, ముంబై ఇండియన్స్ బౌలర్లు ఏ దశలోనూ ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. బౌల్ట్, పాండ్యా, సాంట్నర్, షార్దూల్ తలో వికెట్ తీశారు. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్‌కు ఇది అగ్నిపరీక్షే అని చెప్పాలి. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై, తమ హోమ్ గ్రౌండ్‌లో ఈ రికార్డు స్థాయి స్కోరును ఎలా ఛేదిస్తుందో చూడాలని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






