అటాకింగ్ మైండ్ సెట్ తో గెలిచాం : రజత్ పటీదార్

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2026 'క్వాలిఫయర్-1' మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తో తలపడిన RCB 92 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి, ఫైనల్ కు చేరింది.

అటాకింగ్ మైండ్ సెట్ తో గెలిచాం : రజత్ పటీదార్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 'క్వాలిఫయర్-1' మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో తలపడిన బెంగుళూరు రాయల్ చాలెంజర్స్(RCB) 92 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి, ఫైనల్ కు చేరింది. అయితే మ్యాచ్ అనంతరం RCB కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ధర్మశాలలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో ఒత్తిడిని అధిగమించి ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం, మైదానంలో ప్రశాంతంగా నిలదొక్కుకోవడం కీలకంగా మారిందని అన్నారు.

ఈ మ్యాచ్‌లో తాము కేవలం స్కోరును కాపాడుకోవడానికి (Defend) రాలేదని, ప్రత్యర్థిపై పూర్తి దూకుడుతో అటాక్ చేయాలనే మైండ్ సెట్‌తో బరిలోకి దిగడం వల్లే విజయం సొంతమా అయిందని పటీదార్ పేర్కొన్నారు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ విజయాల్లో బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేస్తూ, ముఖ్యంగా పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్‌లు లీగ్ దశలో పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు తీస్తూ జట్టుకు మంచి ఆరంభాలు ఇచ్చారని, ఫైనల్ లోనూ ఇదే దూకుడును కొనసాగిస్తామని రజత్ పటీదార్ ధీమా వ్యక్తం చేసారు.

Next Story