- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవ్ ఊచకోత.. రాజస్థాన్ సూపర్ విక్టరీ
శుక్రవారం గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో RCB, RR మధ్య జరిగిన మ్యాచులో రాజస్థాన్ సూపర్ విక్టరీ నమోదు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : IPL సీజన్లో RCB తొలి ఓటమిని చవి చూసింది. శుక్రవారం గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచులో రాజస్థాన్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201/8 పరుగులు చేసింది. పటిదార్(63), విరాట్ కోహ్లీ(32), వెంకటేశ్ అయ్యర్(29), షెఫర్డ్(22) పరుగులు చేశారు. అయితే అనంతరం 202 పరుగుల టార్గెట్ తో బ్యాటింగుకు దిగిన రాజస్థాన్.. ఓపెనర్ సూర్యవంశీ వైభవ్ ధాటికి RCB బౌలర్లు బెంబేలెత్తారు. వరుస ఫోర్లు, సిక్సర్లు బాదుతూ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. 28 బాల్స్ లో 78 పరుగులు చేసి ఔటయ్యాడు. జురెల్(81*), జడేజా(24*) కూడా అదరగొట్టారు. దీంతో నిర్ణీత 202 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ చేధించింది. పవర్ ప్లే లో ఓపెనర్లు వైభవ్, జురెల్ భాగస్వామ్యమే RR విజయాన్ని ముందుగానే నిర్ణయించింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్, హేజెల్‌వుడ్ రెండేసి వికెట్లు తీశారు.






