గుజ‌రాత్, రాజ‌స్థాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు.. ఆ జ‌ట్టుకే ఫైన‌ల్స్ ఛాన్స్!

by velandi.Saikiran |   (  Updated:2026-05-29 09:52:00  IST  )

గుజ‌రాత్, రాజ‌స్థాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉండే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

గుజ‌రాత్, రాజ‌స్థాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు.. ఆ జ‌ట్టుకే ఫైన‌ల్స్ ఛాన్స్!
X

దిశ‌, వెబ్ డెస్క్: క్వాలిఫైయర్ 2లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ముల్లాన్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే రెండు జట్లు మ్యాచ్ కోసం సిద్ధం అయ్యాయి. ఇలాంటి క్రమంలో ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి 20 శాతం వరకు ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే వర్షం పడితే, మ్యాచ్ ఆగిపోయే ప్రమాదం ఉంది. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

రిజర్వ్ డే లేని నేప‌థ్యంలో, కచ్చితంగా ఇవాళ మ్యాచ్ ఫినిష్ చేయాలి. లేదా పాయింట్స్ టేబుల్ లో ముందు వరుసలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. వర్షం పడితే మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి అదనంగా 120 నిమిషాలు సమయం అందుబాటులో ఉంటుంది. దాన్ని అంపైర్లు వినియోగించుకునే ఛాన్స్ ఉంది. అలా కుదరకపోతే 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. 5 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే, సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు. మొత్తానికే వర్షం తగ్గకుండా, మ్యాచ్ రద్దు అయితే మాత్రం గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు వెళుతుంది. పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ కు 18 పాయింట్లు ఉన్న నేపథ్యంలో ఫైనల్స్ కు దూసుకువెళుతుంది. అప్పుడు రాజస్థాన్ ఇంటి దారి పట్టాల్సిందే.

Next Story