- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెలరేగిన శ్రేయస్, ప్రభ్‌సిమ్రాన్..ముంబైపై పంజాబ్ విజయం
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ పై గురువారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ పై గురువారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముంబై పై ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సిమ్రాన్ ఇద్దరూ చెలరేగిన నేపథ్యంలో అవలీలగా గెలుపొందింది. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ముంబై 195 పరుగులు సాధించింది.
ఈ లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే ఛేదించింది పంజాబ్. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది PBKS. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ పంజాబ్ విజయం సాధించి తొమ్మిది పాయింట్లు సాధించింది. ఈ క్రమంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. అటు నాలుగు ఓటములతో 9వ స్థానంలో కొనసాగుతోంది ముంబై. కాగా, ముంబైతో జరిగిన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ 66 పరుగులు చేయగా, ప్రభ్‌సిమ్రాన్ 80 పరుగులతో రాణించాడు.






