SRHకు బిగ్ రిలీఫ్‌.. మ‌రో డేంజ‌ర్ ప్లేయ‌ర్ వ‌స్తున్నాడు !

by velandi.Saikiran |

SRHకు బిగ్ రిలీఫ్‌.. పాట్ క‌మిన్స్ తుది జ‌ట్టులోకి వ‌స్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

SRHకు బిగ్ రిలీఫ్‌.. మ‌రో డేంజ‌ర్ ప్లేయ‌ర్ వ‌స్తున్నాడు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రాజస్థాన్ రాయల్స్ పైన విజయం సాధించిన SRH జట్టుకు మరో గుడ్ న్యూస్ అందింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ క‌మిన్స్‌ తిరిగి జట్టులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల హెల్త్ చెకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన క‌మిన్స్‌, తిరిగి ఇండియాకు వస్తున్నారు. బుధవారం రోజున ఆస్ట్రేలియాలో క‌మిన్స్ కు ఫిటినెస్ టెస్ట్ జరగనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆ టెస్ట్ పూర్తయిన తర్వాత ఈ నెల 17వ తేదీన ఇండియాకు క‌మిన్స్‌ రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే, హైదరాబాద్ జట్టులోకి క‌మిన్స్‌ చేరే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని నెలలుగా క‌మిన్స్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026కు కూడా క‌మిన్స్ దూరం అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ లో అదే ప‌రిస్థితి నెల‌కొంది.

Next Story