- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం.. లక్నో ఇంటిదారి
ఐపీఎల్ టోర్నమెంట్‌లో వరుస ఓటములతో సతమతం అయిన పంజాబ్ జట్టు ఎట్టకేలకు ఘన విజయాన్ని నమోదు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ టోర్నమెంట్‌లో వరుస ఓటములతో సతమతం అయిన పంజాబ్ జట్టు ఎట్టకేలకు ఘన విజయాన్ని నమోదు చేసింది. నేడు లఖ్‌నవూతో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. లక్నో జట్టు సీజన్ నుంచి ఔట్ అయింది. ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇంగ్లిస్(72), బదోని(43) పరుగులు చేసారు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగి, కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించారు. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (101*) శతకంతో చెలరేగగా, ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69) అర్ధశతకంతో రాణించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. లఖ్‌నవూ బౌలర్లలో మహ్మద్ షమీ 2 వికెట్లు, అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు చేరాయి. అయితే, పంజాబ్ ప్లేఆఫ్స్ భవితవ్యం మాత్రం ఆదివారం ముంబయితో జరగనున్న రాజస్థాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోతేనే పంజాబ్‌కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే మాత్రం, నెట్‌రన్‌రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌నకు చేరుతుంది. అదే జరిగితే పంజాబ్ టోర్నీ నుంచి ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.






