- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదరగొట్టిన తిలక్ వర్మ...పంజాబ్ పై ముంబై బంపర్ విక్టరీ
పంజాబ్ పై 6 వికెట్ల తేడాతో ముంబై బంపర్ విక్టరీ సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో పంజాబ్ కింగ్స్ మరో ఓటమిని చవిచూసింది. ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ధర్మశాల వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన పంజాబ్ కింగ్స్, 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించింది.
చివరి వరకు పోరాడిన తిలక్ వర్మ
పంజాబ్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి తడబడిన ముంబై ఇండియన్స్ ను తిలక్ వర్మ ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో 33 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు. చివరి వరకు జట్టును నడిపించిన తిలక్ వర్మ.. మ్యాచ్ గెలిపించాడు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది ముంబై ఇండియన్స్. దీంతో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అటు పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదవ ఓటమిని మూటగట్టుకుని, ఎప్పటిలాగే నాలుగో స్థానంలో నిలిచింది.






