- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్నో చిత్తు.. ముంబై భారీ విజయం
ఐపీఎల్ 2026లో ముంబై భారీ విజయం నమోదు చేసుకుంది. లక్నోపై 6 వికెట్ల తేడాతో గెలిచింది.

*రోహిత్ శర్మ, రికెల్టన్ ఊచకోత*
*లక్నోపై ముంబై ఇండియన్స్ గెలుపు*
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కు భారీ ఊరట లభించింది. లక్నోపై తాజాగా జరిగిన మ్యాచ్ సందర్భంగా 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ రెండు జట్లు సోమవారం ముంబై వాంఖడే వేదికగా తలపడ్డాయి. ఈ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసి, 228 పరుగులు సాధించింది.
ఈ క్రమంలో నికోలస్ పురాన్ 63 పరుగులు చేయగా, మార్ష్ 44 పరుగులతో రాణించాడు. చివరలో హిమ్మత్ సింగ్ దుమ్ము లేపాడు. అయితే 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆది నుంచి ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించింది. గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ... 84 పరుగులు సాధించగా మరో ఓపెనర్ రికెల్టన్ 83 పరుగులు చేశాడు. ఈ దెబ్బకు 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ ముంబై 9వ స్థానంలోనే కొనసాగుతోంది. అటు లక్నో చివరగా నిలిచింది.






