- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం..వాళ్లందరికీ బోనస్ ప్రకటన !
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం..వాంఖడే స్టేడియం సిబ్బందికి బోనస్ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వాంఖడే స్టేడియం సిబ్బందికి అండగా నిలిస్తూ.. బోనస్ ప్రకటించింది. గ్రౌండ్ సిబ్బంది గా పనిచేస్తున్న వాళ్లందరికీ తలో లక్ష రూపాయల బోనస్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ముంబై యాజమాన్యం. ఈ మేరకు ఇవాళ చెక్కుల పంపిణీ జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ప్రతి ఏడాది ఇలాగే, ముంబై ఇండియన్స్ యాజమాన్యం నజరానాలు అందిస్తోంది.
ఈ సీజన్ సందర్భంగా కూడా ముంబై ఇండియన్స్ కోసం గ్రౌండ్ సిబ్బంది చాలా కష్ట పడింది. ఈ క్రమంలోనే జట్టు విఫలమైనప్పటికీ, కష్టపడ్డ వాళ్లకు బోనసులు అందించారు. ఈ న్యూస్ వైరల్ అయిన నేపథ్యంలో అంబానీ ఫ్యామిలీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2026 లో గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్, తొమ్మిదవ స్థానానికి పరిమితమైంది. ఇక వచ్చే సీజన్ లోనైనా అద్భుతంగా రాణించేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది.






