తల్లి చనిపోయిన దుఃఖంలోనూ.. పోరాడిన CSK బౌలర్

by velandi.Saikiran |

తల్లి చనిపోయిన దుఃఖంలోనూ తిరిగి జ‌ట్టులో చేరి పోరాడాడు CSK బౌలర్ ముఖేష్ చౌద‌రి.

తల్లి చనిపోయిన దుఃఖంలోనూ.. పోరాడిన CSK బౌలర్
X

దిశ‌, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన తల్లి చనిపోయి 24 గంటలు గడవకముందే తిరిగి జట్టులో చేరి, అద్భుత ప్రదర్శన కనబరిచాడు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముఖేష్ చౌదరి.

దీర్ఘకాలిక వ్యాధితో ముఖేష్ త‌ల్లి మృతి

దీర్ఘకాలిక వ్యాధితో మొన్న‌ ముఖేష్ చౌదరి తల్లి మృతి చెందారు. అయితే ఆమె అంతక్రియలు నిర్వహించిన తర్వాతి రోజే చెన్నై జట్టులో చేరిపోయాడు. అంతేకాదు 7 పరుగులు చేసిన కీలకమైన డికాక్ వికెట్ కూడా తీశాడు. వికెట్ తీయగానే సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఆకాశం వైపు చూస్తూ తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. అటు ముంబై పై చెన్నై విజయాన్ని ముఖేశ్ తల్లికి అంకితం చేస్తున్నట్లు అటు కెప్టెన్ గైక్వాడ్ కూడా వెల్లడించారు.

Next Story