- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో అడుగుపెట్టిన ధోని..ఆ క్రేజ్ చూడండి
హైదరాబాద్ గడ్డపై మహేంద్ర సింగ్ ధోని అడుగు పెట్టారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ గడ్డపై మహేంద్ర సింగ్ ధోని అడుగు పెట్టారు. SRHతో మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ క్రమంలో మహేంద్రసింగ్ ధోనీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలో ధోని ఉన్న బస్సు వైపు ఫ్యాన్స్ పరుగులు తీశారు. బస్సు బయట నుంచి తమ అభిమాన క్రికెటర్ ఫోటోలు తీసుకుని తెగ సంబరపడిపోయారు. ఇక అటు శంషాబాద్ విమానాశ్రయంలో మహేంద్ర సింగ్ ధోని దిగిన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.
కాగా ఈ నెల 18వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైట్ ఉండనుంది. ఇప్పటి వరకు చెన్నై తరఫున ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని, హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ కు మాత్రం అందుబాటులో ఉంటాడని అంటున్నారు. అందుకే తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ చేరుకున్నట్లు చెబుతున్నారు. మరి హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ సందర్భంగా తుది జట్టులో ధోని ఉంటాడా ? లేడా ? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.






