వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్ షాక్‌..ఇక అత‌ని క‌థ ముగిసిన‌ట్లే !

by velandi.Saikiran |

మొహ్సిన్ ఖాన్‌ బౌలింగ్ లో ఇప్పటి వరకు వైభవ్ సూర్యవంశీ రెండు సార్లు ఔట్ అయ్యాడు.

వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్ షాక్‌..ఇక అత‌ని క‌థ ముగిసిన‌ట్లే !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆరెంజ్ క్యాప్ పోటీలో కూడా వైభవ్ ఉన్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు వైభవ్. ప్రతి మ్యాచ్ లో అర్థ సెంచరీ, కుదిరితే సెంచ‌రీ చేయడమే లక్ష్యంగా దూసుకు వెళ్తున్నాడు. నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా సెంచరీ మిస్ చేసుకున్నాడు కానీ.. మ్యాచ్ గెలిపించాడు. అయితే ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ ఆట కట్టించేందుకు సరైన బౌలర్ రంగంలోకి దిగాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

లక్నో జట్టుకు సంబంధించిన మొహ్సిన్ ఖాన్‌ బౌలింగ్ లో ఇప్పటి వరకు వైభవ్ సూర్యవంశీ రెండు సార్లు ఔట్ అయ్యాడు. ఈ సీజన్ లోనే రెండు సార్లు వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. ఐపీఎల్ 2026 నేపథ్యంలో మొహ్సిన్ ఖాన్‌ వేసిన 12 బంతులను వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రెండు సార్లు వైభవ్ ను డిస్మిస్ చేశాడు. వైభవ్ వీక్నెస్ తెలుసుకొని... అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మొహ్సిన్ ఖాన్‌ సక్సెస్ అవుతున్నాడు. దీంతో వైభవ్ ను కట్టడి చేసే, సరైన మగాడు దొరికాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Next Story