- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCBని లైట్ తీసుకున్న గుజరాత్..నదులు, గుట్టల మధ్య చిల్ !
కాసేపట్లో ఆర్సీబీతో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో నదిలో గుజరాత్ ప్లేయర్లు చిల్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మరికాసేపట్లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ షురూ అవుతుంది. ఈ తరుణంలో నదులు, గుట్టల మధ్య తిరుగుతూ చిల్ అవుతున్నారు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు. నిన్న సాయంత్రం ధర్మశాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను చుట్టేశారు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఇతర గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు ధర్మశాలలో ఉన్న కొండలు, గుట్టలు ఎక్కారు.
ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ నదిలో స్నానం చేస్తూ చిల్ అయ్యారు. ధర్మశాలలో ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, రిలాక్స్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరుతో సీరియస్ మ్యాచ్ పెట్టుకొని, గుజరాత్ బౌలర్లు ఎంత రిలాక్స్ గా ఉన్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. RCB జట్టును గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు లైట్ తీసుకున్నట్లు ఉందని.. అందుకే ఇలా ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నిన్న చిల్ అయిన గుజరాత్ ప్లేయర్లు, ఇవాళ ఉదయం నుంచే ప్రాక్టీస్ చేశారని నివేదికలు చెబుతున్నాయి.






