భారీ వ‌ర్షం...కేకేఆర్‌, పంజాబ్ మ్యాచ్ రద్దు

by velandi.Saikiran |

భారీ వ‌ర్షం నేప‌థ్యంలో కేకేఆర్‌, పంజాబ్ మ్యాచ్ రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణ‌యం తీసుకున్నారు.

భారీ వ‌ర్షం...కేకేఆర్‌, పంజాబ్ మ్యాచ్ రద్దు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన పంజాబ్, కేకేఆర్ మ్యాచ్ కు వర్షం అంతరాయం ఏర్పడింది. వర్షం ఎంతసేపటికి తగ్గకపోవడంతో, మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ తరుణంలో రూల్స్ ప్రకారం కేకేఆర్, పంజాబ్ జట్లకు చెరో పాయింట్ దక్కింది.

దీంతో స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వేలకు వేలు పెట్టి టికెట్లు కొనుగోలు చేస్తే, వరుణ దేవుడు కరుణ చూపించలేదని ఎమోషనల్ అవుతున్నారు. చివరికి సూపర్ ఓవర్ అయినా నిర్వహిస్తే సరిపోయేదని మరి కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది కేకేఆర్. ఈ క్రమంలో మొదటి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 3.4 ఓవర్లు ఆడే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. అప్పటికే వర్షం ప్రారంభం కాగా.. ఎంతసేపటికి కూడా తగ్గలేదు. దీంతో మ్యాచ్ రద్దయింది. కాగా ఏప్రిల్ 26, 2025 సంవత్సరంలో కూడా ఇదే వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం.

Next Story