దుమ్ములేపిన‌ ఢిల్లీ బౌల‌ర్లు...ల‌క్నో స్కోర్ ఎంతంటే?

by velandi.Saikiran |

ఢిల్లీ బౌల‌ర్ల దాటికి...141 ప‌రుగుల‌కే కూప్ప‌కూలింది ల‌క్నో.

దుమ్ములేపిన‌ ఢిల్లీ బౌల‌ర్లు...ల‌క్నో స్కోర్ ఎంతంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్ లో లక్నో చిత్తయింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది పంత్ సేన. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి ఢిల్లీ బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థి లక్నో జట్టుకు చుక్కలు చూపించారు. ఏ ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. ఈ క్రమంలోనే 141 పరుగులకు ఢిల్లీ దెబ్బకు లక్నో ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్ లో లక్నో ఆటగాడు మిచెల్ మార్ష్ 35 పరుగులు సాధించగా, అబ్దుల్ సమద్ 36 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన బ్యాటర్లందరూ అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగీ ఎంగిడీ, నటరాజన్ తలో మూడు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేస్తే లక్నోపై ఢిల్లీ విజయం సాధిస్తుంది.

Next Story